ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి.. –కరీంనగర్ నియోజకవర్గ నుంచి గ్రామ గ్రామానా కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలి.. –కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ గుమ్లాపూర్ లో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కు కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని...

కరీంనగర్
గుమ్లాపూర్ లో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కు కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. బుధవారం రాజేంద్ర రావు మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలంలోని 14 గ్రామాలు, కొత్తపల్లి మండలంలోని ఆరు గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ప్రజలు వేలాదిగా బహిరంగ సభకు తరలిరావాలని కోరారు. సుమారు ప్రతి గ్రామం నుంచి 700 మందిని తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని సూచించారు. కార్లు ద్విచక్ర వాహనాలు డీసీఎంలు ఇతర వాహనాల ద్వారా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు గుమ్లాపూర్ చేరుకోవాలని రాజేందర్రావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను కాంగ్రెస్ నాయకులు సర్పంచులు సీనియర్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలను కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించే ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గుమ్లాపూర్ రావడం శుభసూచికమని రాష్ట్రంలో చేపడుతున్న బృహత్తర కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విని గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు నాయకులు సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని రాజేందర్రావు పేర్కొన్నారు.
No Comment! Be the first one.