మీరు మేడారం జాతరకు వెళ్తున్నారా?*
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా జాతరకు సంబంధించిన కీలక వివరాలను భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. భక్తులు...

మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా జాతరకు సంబంధించిన కీలక వివరాలను భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. భక్తులు 76589 12300 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపితే జాతరకు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పొందవచ్చు. జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్డేట్స్, పార్కింగ్ వివరాలు, వైద్య కేంద్రాల సమాచారం, స్నానఘట్టాల వివరాలతో పాటు ఇతర అవసరమైన సూచనలు నేరుగా వాట్సాప్‌లోనే లభిస్తాయి.
No Comment! Be the first one.