భారత రాజ్యాంగ పరిరక్షణ,లౌకిక వ్యవస్థ పటిష్టత కోసం ప్రజాస్వామ్య వాదులు ఏకం కావాలి. — సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. — సిపిఐ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్.
కరీంనగర్ భారత రాజ్యాంగం రూపొందించడానికి బాబు రాజేంద్రప్రసాద్ ను అధ్యక్షులుగా నియమించినప్పటికీ మూడు సంవత్సరాలకు పైగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అనేక దేశాల్లో పర్యటించి ఆయా దేశాల్లోని...

కరీంనగర్
భారత రాజ్యాంగం రూపొందించడానికి బాబు రాజేంద్రప్రసాద్ ను అధ్యక్షులుగా నియమించినప్పటికీ మూడు సంవత్సరాలకు పైగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అనేక దేశాల్లో పర్యటించి ఆయా దేశాల్లోని రాజ్యాంగాలను అధ్యయనం చేసి, రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ అని, భారతదేశంలో సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, ఈ దేశంలో ఉన్న విభిన్న కులాలకు,మతాలకు, సంస్కృతులకు, సాంప్రదాయాలకు, భాషలకు పెద్దపీట వేస్తూ లౌకిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆయన రూపొందించిన రాజ్యాంగం1950 లో అమలులోకి వచ్చిందని, ఆ రాజ్యాంగం వెలుతురులోనే నేడు భారతదేశ పరిపాలన కొనసాగుతుందని అలాంటి రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకమై కావాలని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటుచేసిన జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందని, ఆ కాలంలో భూస్వామ్య వ్యవస్థ,పెట్టుబడి దారి వ్యవస్థ ఆరంభమవుతున్న తరుణంలో దానికి అడ్డుకట్ట వేయడానికి సమ సమాజ స్థాపన లక్ష్యంగా, సోషలిస్టు వ్యవస్థను పటిష్టపరిచేందుకు అడుగులు పడ్డాయని, 1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకపోతే హక్కులను హరించే ప్రమాదం ఉందని, రాజ్యాంగ ప్రవేశ పీఠికలో దేశంలోని ప్రతి ఒక్కరికి కూడు,గుడ్డ, నీడ ఉండాలని, విద్య వైద్యం ఉపాధి అవకాశాలకు అందరికీ అందుబాటులోకి తేవాలని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ అవి అమలుకు నోచుకోకపోవడం అత్యంత బాధాకరమన్నారు.
77వ గణతంత్ర్యo లోకి అడిగిడుతున్నప్పటికీ దేశంలో ఇంకా అసమానతలు తొలగిపోలేదని కులాల, మతాల మధ్య అంతరాలు ఉన్నాయని, 11 సంవత్సరాల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించుతోందని, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నారని, వరవర రావు,ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిపై రాజా ద్రోహం కేసులు పెట్టి హింసించారని, ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారని, ఇలాంటి చర్యల వల్ల రాజ్యాంగం పెను ప్రమాదంలో పడుతుందని అన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆదానీ,అంబానీ లాంటి వారికి పెద్దపీట వేస్తూ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులుగా తీర్చిదిద్దడానికి మోడీ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని, రైతులు,కూలీలు కష్టపడి సంపాదించుకుంటే వాటికి పరోక్ష పన్నుల వేసి దోచుకుంటున్నారనారు. వామపక్షాలు,కాంగ్రెస్,ఇతర పక్షాలన్నీ కలిసి 2005లో పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే,నేడు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి ఆ పథకాన్ని నీరుగారిచే విధంగా వ్యవహరిస్తుందని, గతంలో ఆ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి 90% నిధులు ఇస్తే రాష్ట్రాలు 10% ఇచ్చేవని,ఇప్పుడు కేంద్రం 60% నిధులు ఇస్తూ,రాష్ట్రం 40% నిధులు ఇవ్వాలని నిర్ణయించడం మూలంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై భారం పడే ప్రమాదం ఉందని,నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యధావిధిగా ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరును అలాగే కొనసాగించాలని అన్నారు.
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల హక్కులను,చట్టాలను, రాజ్యాంగ,ప్రజాస్వామ్య పరిరక్షణ,లౌకిక వ్యవస్థను కాపాడడం కోసం దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, మచ్చ రమేష్,భామండ్ల పెళ్లి యుగంధర్, బీర్ల పద్మ, కొట్టే అంజలి, బూడిద సదాశివ, బోనగిరి మహేందర్, నాయకులు గామినేని సత్యం,కసిబోజుల సంతోష్ చారి,కూన రవి,చెంచల మురళి, కసిరెడ్డి లతశ్రీ,కూన సమత,ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.