బోత్ ఆర్ నాట్ సేమ్* *మా వాళ్లు గుణవంతులు…. వాళ్లు ధన వంతులు* *మా వాళ్లు మీ కోసం కొట్లాడి జైలుకు పోతే…వాళ్లు కబ్జాలు చేసి జైలుకు వెళ్లారు* *మేం కేంద్రం నిధులు తెచ్చినం… వాళ్ల తెచ్చిన నిధులను డైవర్ట్ చేశారు* *వాళ్లు గెలిస్తే పన్నుల మోత… మేం గెలిస్తే పన్నులు పెంచకుండా అభివ్రుద్ధి చేస్తాం* *ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారో మీరే ఆలోచించుకుని తీర్పు ఇవ్వండి* *బీజేపీకి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే వరదల్లా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తా…* *కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…*
కరీంనగర్ కరీంనగర్ లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదల్లా నిధులు తెచ్చే బాధ్యత తీసుకు వస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను...

కరీంనగర్
కరీంనగర్ లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదల్లా నిధులు తెచ్చే బాధ్యత తీసుకు వస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను గెలిపిస్తే మీ ఇండ్లలోకి వరద నీళ్లు వస్తాయే తప్ప అభివ్రుద్ధి జరగదని అన్నారు. ‘‘బీజేపీ పక్షాన పోటీ చేసే అభ్యర్థులు గుణవంతులైతే… కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ధనవంతులు. మా వాళ్లు (బీజేపీ) మీ సమస్యలపై పోరాటం చేసి జైలుకు పోతే, ఆ పార్టీల నాయకులు కబ్జాలు, దోపిడీలు చేసి జైలు కెళ్లారు. బోత్ ఆర్ నాట్ సేమ్’’అని తనదైన శైలిలో చెప్పారు.
ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని రాంనగర్ సత్యనారాయణ స్వామివద్ద తొలుత 46, 47 డివిజన్ల అభ్యర్థులు అఖిల్ గౌడ్, గాజె రమా శివరాం పక్షాన, అనంతరం కమాన్ చౌరస్తా వద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో 38, 56, 57 డివిజన్ల అభ్యర్థులు దేవసాని సరస్వతి, తాటి ప్రభావతి, కొలిపాక రమ్యశ్రీ పక్షాన ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్ల బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యర్ధించారు. మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, సీనియర్ నాయకులు నల్లాల ఓదేలు, ప్రమోద్ రావు, యువ క్రాంతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
ఇక్కడ రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ నుండి సంతోష్ నగర్, పారమిత స్కూల్, జ్యోతి నగర్, భాగ్యనగర్ సాయిబాబా టెంపుల్ ఏరియా రోడ్లు…. హైమాస్ట్ లైట్ మొదలు ఇక్కడ జరిగిన అభివ్రుద్ధి పనులన్నీ స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించినవే…
టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డు, అవతల ఉన్న ఎల్ఎండి బైపాస్ రోడ్డును సైతం కేంద్రం ఇచ్చిన 30 కోట్లతో ఆధునికరించినం.
ఇట జాతీయ రహదారి కనెక్టింగ్ రోడ్డు.. అటు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఇటు సిరిసిల్ల బైపాస్ రోడ్డు వరకు రూపాయల 10 కోట్ల కేంద్ర నిధులతోనే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు… కేంద్ర పైసలతోనే సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినం.
అమృత్ 1 ద్వారా కేంద్రం 132 కోట్లు ఇస్తే ఆ పైసలతోనే మార్క్ ఫెడ్ దగ్గర కొత్త రిజర్వాయరు ను నిర్మించినం. గతంలో డైలీ ఇంటికి నీళ్లు వచ్చేవి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల దినం తప్పించి దినం నీళ్లు వస్తున్నయ్.
కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే… ప్రతినిత్యం తాగునీటి సరఫరా అందిస్తాం.
46 డివిజన్లో ఆశించిన అభివృద్ధి జరగలే. అఖిల్ గౌడ్ యాక్టివ్. అఖిల్ తోపాటు 47వ డివిజన్ అభ్యర్ధిని గాజ రమను, 38వ డివిజన్ దేవసాని సరస్వతి, 56వ డివిజన్ తాటి ప్రభావతి, 57వ డివిజన్ కొలిపాక రమ్యశ్రీలను భారీ మెజారిటీతో గెలిపిస్తే పెండింగ్ పనులన్నీ పూర్తి చేయిస్తా… ఆదర్శంగా తీర్చిదిద్దుతా…
ఇక్కడ సత్యనారాయణ ఆలయంలో అన్నీ రాజకీయాలే నడుస్తున్నయ్. పూజలు చేయనీయరు. ఆధిపత్య పోరుతో నలిగిపోతోంది. ఈ ఆలయానికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. నేను కూడా రాలేదు.
నేను మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన. అమ్మవారే అన్నీ. ఆ ఆలయానికి ఛైర్మన్ ఉండరు. హుండీలు ఉండవు. మేమంతా అమ్మవారి సేవకులే. ఆలయం కడితే చందాలు వసూలు చేయను. బీజేపీకి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే సత్యానారాయణ స్వామి ఆలయం వద్ద ధ్వజ స్తంభం కట్టిస్తా. ఆలయాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తా.
ఈ కమాన్ నుంచి.. భారత్ టాకీస్ చౌరస్తా.. టవర్ సర్కిల్ రోడ్డు.. శాస్త్రి రోడ్డుకు వెళ్లే రోడ్డు..రాజీవ్ చౌక్ రోడ్ల బాగైనంటే కేంద్ర నిధులతోనే…గతంలో గణేష్ నగర్ అంబేద్కర్ స్టేడియం రోడ్డుపై వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిండే… చినుకు పడితే గోస ఉండేది…మరి ఇయాళ ఎట్లుంది?…ఆ పక్కనున్న డ్రైనేజీని వెడల్పు చేసి పైన స్లాబ్ వేసి.. ఆధునికరించిన పైసలన్నీ కేంద్రానివే.
38వ డివిజన్లో ప్రతిపాదనల దశలోనే ఆగిన కొన్ని పనులు. శ్రీనివాస్ థియేటర్ తోపాటు ఇంటర్నల్ రోడ్లు అవసరం. కొన్నింటికి బిల్లులు రాక ఆగినయ్. కలెక్టరేట్ నుంచి వచ్చే పెద్ద డ్రైనేజీ సమస్య…దీంతోపాటు ఈ 3 డివిజన్లపై ద్రుష్టి పెడతా…
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచి ఒక్క పైస ఇయ్యలేదు. మేయర్ పీఠం అప్పగిస్తే కొన్ని నెలల్లోనే వాటిని పూర్తి చేయిస్తాం.
మోదీ ప్రభుత్వం ఇచ్చిన 26 కోట్లతోనే అంబేద్కర్ స్టేడియాన్ని ఆధునీకరించినం. మోడ్రన్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినం…పిల్లల కోసం బాస్కెట్ బాల్ కోర్టు, స్కేటింగ్ మైదానం, వాకింగ్ ట్రాక్ ను నిర్మించాం. ఇండోర్ స్టేడియాన్ని బాగు చేసినం. ఈ కమాను నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీకి అటు రాజీవ్ రహదారి వరకు, గోదావరిఖని బైపాస్ దాకా కేంద్ర నిధులతోనే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినం
బీఆర్ఎస్ అంటేనే భూ రాక్షసుల సమితి. వాళ్లు అధికారంలో ఉన్నంతకాలం కబ్జాలు చేసి దోచుకున్నరు. పదేళ్ల పాలనలో ప్రజలను జలగల్లా పీల్చుకుతిన్నరు. కనబడ్డ జాగాలను కబ్జా చేసిర్రు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంత దోచుకున్నరో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అంతకంటే ఎక్కువ దోచుకుంటున్నరు. కరీంనగర్ కార్పొరేషన్ కు మాత్రం నయాపైసా ఇయ్యలే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలే.
కేంద్రం నుండి నేను మోదీ వద్దకు పోయి నీళ్ల కోసం రూ.136 కోట్లు తెచ్చిన. కరీంనగర్ అభివ్రుద్ధి పనుల కోసం మరో రూ.50 కోట్లు తెచ్చిన.
కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇంటి పన్నులు పెంచుతారు. నల్లా బిల్లులు పెంచుతారు. అన్ని రకాల పన్నులు పెంచి ఖజానా నింపుకుంటరు. బీఆర్ఎస్ గెలిచినా ప్రయోజనం లేదు. కేంద్రం నుండి వచ్చిన పైసలను సంపుకుంటరు.
కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి. ఇంటి పన్నులు పెంచకుండా, నల్లా ఛార్జీలు పెంచకుండా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ ను అన్ని రకాలుగా అభివ్రుద్ధి చేస్తా… దయచేసి అభివ్రుద్ధిని మధ్యలో ఆగకుండా ఉండాలంటే బీజేపీని గెలిపించాలని కోరుతున్నా.
ఈ ఎన్నికలు ధనవంతులకు, గుణవంతులకు మధ్య జరుగుతున్న పోరాటం. ధనవంతులను గెలిపిస్తే మీ పనుల కోసం వాళ్ల ఇండ్ల చుట్టూ వ తిరగాలి. మంచి గుణమున్న అభ్యర్థి నీ వెంట ఉంటే అభివృద్ధి జరుగుతుంది. అదే ధనమున్న వ్యక్తిని ఆదరిస్తే మరింత దోపిడీ జరుగుతుంది. గుణవంతులను గెలిపిస్తే వాళ్లు ఎప్పుడు మీ వెంట ఉంటూ సేవ చేస్తారు. గుణవంతులవైపు ఉంటారో.. ధనవంతుల వైపు ఉంటారో.. మీరే ఆలోచించుకోండి.
వాళ్లది కాసుల ఆరాటం వాళ్ళది.. మాది ప్రజా సమస్యలపై పోరాడే ఆరాటం. వాళ్ల కబ్జాలు చేసి జైలుకు పోయినోళ్లు… మా వాళ్లు మీ కోసం కొట్లాడితే జైలుకు వెళ్లినోళ్లు. ఎవరికి ఓటేస్తారో ఆలోచించి తీర్పు ఇవ్వండి.
No Comment! Be the first one.