బీఆర్ఎస్ బిజెపిని బండకేసి కొట్టండి.. –వారికి ఓట్లు వేయడం వృధా.. –కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకోండి.. –ప్రజలకుఎల్లవేళలా అండగా ఉంటాం.. –కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ బిజెపిలను బండకేసి కొట్టాలని వారికి ఓటు వేయడం వృధా అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు...

కరీంనగర్
కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ బిజెపిలను బండకేసి కొట్టాలని వారికి ఓటు వేయడం వృధా అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ లోని
7 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం రాత్రి ఆకుల నందిని ఉదయ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజేందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్రావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో కబ్జా కోరు బీఆర్ఎస్ పార్టీకి కర్రకు కాల్చి వాత పెట్టాలని ప్రజలను కోరారు. అలాగే ఢిల్లీలో ఉండే బిజెపి గల్లి సమస్యలతో సంబంధం లేదన్నారు. గల్లి సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పరిష్కారం అవుతాయని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆదరించాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆకుల నందిని ఉదయ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఏ కష్టమొచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అందుబాటులో ఉంటామని చేయూతనందిస్తామని స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాజేందర్రావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఆకుల నందిని ఉదయ్ కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి అనంతరెడ్డి తో పాటు పలువురు నేతలు డివిజన్ ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No Comment! Be the first one.