బీఆర్ఎస్, బిజెపికి ఓటు వేయడం వృధానే.. -మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మేమంతా కరీంనగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం..–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపి ఓట్లు వేయడం వృధానేనని వారికి ఓటు వేస్తే కరీంనగర్ అభివృద్ధి కుంటుపడుతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు...

కరీంనగర్
కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపి ఓట్లు వేయడం వృధానేనని వారికి ఓటు వేస్తే కరీంనగర్ అభివృద్ధి కుంటుపడుతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మేమంతా కలిసి కరీంనగర్ ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఆదివారం 64 డివిజన్లో గందె కల్పన ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేంద్ర రావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపికి ఓటు వేస్తే మురిగిపోతుందని పేర్కొన్నారు. గల్లీ గల్లీలో సమస్యల పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పారిశుద్ధ పనులు రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం తాగునీటి సరఫరా పోలీస్ పరంగా రెవెన్యూ పరంగా సమస్యలు పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను ఆశీర్వదించి అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తద్వారా కరీంనగర్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దుకుందామని రాజేందర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక సమస్యలన్నీ కాంగ్రెస్తోనే పరిష్కారం అవుతాయని ప్రజలంతా కాంగ్రెస్ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ కాంగ్రెస్ నాయకులు గందే కల్పన విశ్వేశ్వరరావు చక్రధర్ రావు కాంగ్రెస్ నాయకులు డివిజన్ ప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
No Comment! Be the first one.