బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
కరీంనగర్ బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం...

కరీంనగర్
బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కవిత విశ్వనాథన్ గారు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ సందర్భంగా చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రాముఖ్యత, యువత దేశాభివృద్ధిలో పోషించాల్సిన పాత్ర గురించి వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తిని అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు.ప్రిన్సిపాల్ భాబితా విశ్వనాథన్ గారు మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం మనకు స్వేచ్ఛ, సమానత్వం, బాధ్యతలను గుర్తు చేస్తుందని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.కార్యక్రమం చివర్లో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
No Comment! Be the first one.