ఫార్వర్డ్ బ్యాక్ పార్ట్ లో చేరిన బీసీ ఉద్యమ నేత శ్రీధర్ రాజు…*
కరీంనగర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ బీసీ సంఘాల నేత కేశి పెద్ది శ్రీధర్ రాజు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆధ్వర్యంలో...

కరీంనగర్
జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ బీసీ సంఘాల నేత కేశి పెద్ది శ్రీధర్ రాజు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆధ్వర్యంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేయడం జరిగింది. సోమవారం రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి, శ్రీధర్ రాజుకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జోజి రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ రాజు గత 36 సంవత్సరాలుగా బీసీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు సాధనకై పార్టీలో చేర్దానం వచ్చి చేరాలని.. భవిష్యత్తులోశ్రీధర్ రాజుకు పార్టీలో సంస్కృత స్థానం కల్పిస్తామని తెలిపారు.కరీంనగర్ నగరపాలక సంస్థ 63వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీధర్ రాజును ప్రకటిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ ఎలక్షన్లలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను ఎగరవేస్తామని తెలిపారు.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎదగబోతుందని అన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ రాజు చేరిక భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి ఎంతో గాను దోహదపడుతుందని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన శ్రీధర్ రాజు మాట్లాడుతూ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని 63వ డివిజన్ లో సింహం గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ. ఐ.ఎస్ బి రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్,చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి ముత్యాల విజయ్ కుమార్, నాయకులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.