ప్రైవేట్ పీఈటీల క్రికెట్ లీగ్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల …
కరీంనగర్ జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిర్వహించే పిపిఈటిఏ సూపర్ సిక్స్ క్రికెట్ లీగ్ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆదివారం మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు...


కరీంనగర్
జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిర్వహించే పిపిఈటిఏ సూపర్ సిక్స్ క్రికెట్ లీగ్ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆదివారం మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అదేవిధంగా ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాలంలో క్రీడలకు ఆదరణ పెరిగిందని ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి పాఠశాలలో పిఈటి పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేకు నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు, ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శ్రీధర్ గౌడ్, దారం గౌతమ్ రెడ్డి, కోశాధికారి కంకటి అనూప్ కుమార్, ముఖ్య సలహాదారు సిలివేరి మహేందర్ తోపాటు మైపాల్, ముఫాజిల్ , స్వామి, ప్రశాంత్, దుర్గరాజు, రవి, శివ, నరేందర్, జీవన్, అనూప్ కుమార్, శ్రీధర్ గౌడ్, గౌతమ్ రెడ్డి, రవికుమార్, మహ్మద్రుఫ్, షరీఫ్, శ్రీధర్, రాజు, అంజి, ప్రశాంత్, రాకేష్, మనీ, వినయ్, సుశీల్, మహేందర్, శ్రీనివాస్ నాయక్, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
No Comment! Be the first one.