ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం
దేశ వ్యాప్తంగా మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయ కలగనుంది. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు జనవరి 27న...

దేశ వ్యాప్తంగా మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయ కలగనుంది. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు జనవరి 27న బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. డిమాండ్లపై చీఫ్ లేబర్ కమిషనర్ తో ఈ నెల 23న జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో బ్యాంకు అధికారులు, సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది సంఘాల ఉమ్మడి వేదిక.. UFBU సమ్మె పిలుపునిచ్చింది.
No Comment! Be the first one.