ప్రభాస్, చిరంజీవి మల్టీస్టారర్.. బాక్సాఫీస్ షేక్ అయ్యేలా స్టార్ డైరెక్టర్ ప్లానింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సెన్షేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న చిత్రం స్పిరిట్. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ కోసం సందీప్ అన్ని రకాలుగా రెడీగా...

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సెన్షేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న చిత్రం స్పిరిట్. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ కోసం సందీప్ అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు. స్క్రిప్ట్, నిర్మాతలు, నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ అందరినీ సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ కావాల్సింది ప్రభాస్ మాత్రమే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ త్వరలోనే స్పిరిట్ సెట్లో అడుగుపెట్టనున్నారు. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో పాటు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తొలి సినిమా కావడంతో స్పిరిట్‌పై టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలను నెలకొన్నాయి. ప్రభాస్ కటౌట్, ఇమేజ్‌కు తగినట్లుగా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉపయోగించి ఈ సినిమాను సిద్ధం చేయనున్నారట సందీప్. సందీప్ చెప్పిన పాయింట్ నచ్చడంతో రెండేళ్ల క్రితమే ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే అప్పటికే సలార్, కల్కి 2898 ఏడీ, ది రాజా సాబ్ వంటి సినిమాల షూటింగ్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నారు. వీటిని త్వరగా పూర్తి చేసి స్పిరిట్ సెట్లో జాయిన్ అవ్వాలని డార్లింగ్ భావించారు. సందీప్ హీరోలు తొలి నుంచి వయలెంట్‌గా, సీరియస్ లుక్‌లో ఉంటారు. అలాంటిది ప్రభాస్‌ను సందీప్ ఎలా చూపించబోతున్నారు? అంటూ ఆయన అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు..ప్రభాస్ ఈ మూవీలో పోలీస్ యూనిఫాంలో కనిపించనున్నారని ఊహాగానాలతో పాటు ఫ్యాన్ మేడ్ ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. కెరీర్లో అన్ని రకాల పాత్రలు చేసిన ప్రభాస్ ఇప్పటి వరకు ఖాకీ డ్రెస్ వేయలేదు. దాంతో ఆయన కనుక లాఠీ పట్టుకుంటే బాక్స్‌లు బద్ధలేనని అభిమానులు అంటున్నారు. అయితే అధికారికంగా స్పిరిట్ మూవీ ప్రారంభం కాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఈ దశలో న్యూఇయర్ గిఫ్ట్ కింద సైలెంట్‌గా సర్ప్రైజ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా.
No Comment! Be the first one.