ప్రధాన రహదారిపై మీటింగ్ లా…! –అనుమతులేలా ఇస్తారు..?
తిమ్మాపూర్ అల్గునూర్ రాజీవ్ రహదారి పై ఆదివారం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం పై తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి అభ్యంతరం వ్యక్తం చేసారు. అల్గునూర్ చౌరస్తా లో ప్రజలకు...

తిమ్మాపూర్
అల్గునూర్ రాజీవ్ రహదారి పై ఆదివారం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం పై తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి అభ్యంతరం వ్యక్తం చేసారు. అల్గునూర్ చౌరస్తా లో ప్రజలకు సంక్షేమ కోసం గానీ,రాజకీయ పార్టీ ల అవసరాలకోసం గానీ రాస్తా రోఖో లేదా ధర్నా చేసినట్లయితే సుమారు కిలో మీటర్ వరకు ట్రాఫిక్ జాం జరుగుతుంది.ఈ ట్రాఫిక్ ను సరి చేయడానికి అరకొరగా ఉన్న పోలీసులకు చాలా ఇబ్బంది జరుగుతుంది.అందుకే పోలీసులు ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తారు.ఒకవేళ అనుమతి లేకుండా కార్యక్రమాలు చేస్తే కేసులు భాద్యలపై నమోదు చేయడం జరుగుతుంది.ఇదే నిబంధన కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించదా..? ఈనాటి సమావేశం నిర్వహించిన భాద్యులపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ సమావేశానికి ఏమైనా అనుమతులున్నాయా అని పోలీస్ వారిని అడిగితే తెలియదని సమాధానం చెప్పినట్లు బీజేపీ అధ్యక్షులు తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం ట్రాఫిక్ జాం వల్ల ప్రజలకు ఇబ్బంది జరిగే ప్రాంతాలలో ఎటువంటి సభలకు, సమావేశాలకు అనుమతులు ఇవ్వరాదని మీడియా ద్వారా అధికార యంత్రాంగాన్ని కోరినట్లు తెలిపారు.ప్రజలకు ఇబ్బంది జరిగేలా నడిరోడ్లపై సభలుఏర్పాటు చేసే కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిని ఖండిస్తున్నట్లు ప్రకటన లో పేర్కొన్నారు.
No Comment! Be the first one.