పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ‘వార్షిక డీ-మొబిలైజేషన్ పరేడ్’ – ముఖ్య అతిథిగా హాజరైన సిపి గౌష్ ఆలం, ఐపిఎస్
కరీంనగర్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన వార్షిక పరేడ్ కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపిఎస్ ముఖ్య అతిథిగా...
కరీంనగర్
కరీంనగర్ పోలీస్ కమిషనర్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన వార్షిక పరేడ్ కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై, సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి పరేడ్‌ను పర్యవేక్షించారు.అనంతరం పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి సిపి ప్రసంగిస్తూ.. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ అన్యువల్ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా సిబ్బందికి వృత్తిపరమైన శిక్షణను పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు.బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత, ఇలాంటి వార్షిక శిక్షణా తరగతులు పోలీసుల్లో మరింత నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని, దీనివల్ల ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. గత నాలుగు వారాలుగా జరిగిన ఈ శిక్షణా కాలంలో సిబ్బందికి క్షేత్రస్థాయి విధులకు సంబంధించిన పలు కీలక అంశాలపై తర్ఫీదు ఇచ్చారన్నారు. వివిధ రకాల తుపాకుల వినియోగం మరియు మెయింటెనెన్స్‌పై ప్రత్యేక శిక్షణ, ఖైదీలను కోర్టులకు లేదా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు, భద్రతా గార్డుగా మరియు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (PSO)గా నిర్వహించాల్సిన బాధ్యతలు, అత్యవసర సమయాల్లో గురి తప్పకుండా ఫైరింగ్ చేసే విధానంపై ప్రాక్టికల్ శిక్షణ అందించమన్నారు.శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అధికారులు మరియు సిబ్బందిని సిపి ప్రత్యేకంగా అభినందించారు. క్రమశిక్షణతో కూడిన ఇటువంటి శిక్షణలు పోలీసు వ్యవస్థ పటిష్టతకు దోహదపడతాయని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఆర్.ఐ. పరిపాలన రజినీకాంత్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

No Comment! Be the first one.