పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: సరోజా వివేకానంద
విజయవాడ: నేటి యువత పరిశ్రమల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యాలు సాధించాల్సిన అవసరం ఉందని విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జి. సరోజా...

విజయవాడ:
నేటి యువత పరిశ్రమల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యాలు సాధించాల్సిన అవసరం ఉందని విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జి. సరోజా వివేకానంద అన్నారు. మంగళవారం పి.బి. సిద్ధార్థ కళాశాల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు సంతృప్తిని అందించడమే నిజమైన విజయమని పేర్కొన్నారు. పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య సమన్వయం బలపడితేనే విద్యార్థులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందగలరని సూచించారు.
No Comment! Be the first one.