పదేళ్ల పాలనలో కరీంనగర్ దరిద్రాన్ని తొలగించే ప్రయత్నం చేశాం– ఎమ్మెల్యే
కరీంనగర్ నలబై యాబై ఏళ్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కరీంనగర్ కు పట్టిన దరిద్రాన్ని పదేండ్ల బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తొలగించే ప్రయత్నం చేశామని అన్నారు మాజీ...
కరీంనగర్
నలబై యాబై ఏళ్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కరీంనగర్ కు పట్టిన దరిద్రాన్ని పదేండ్ల బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తొలగించే ప్రయత్నం చేశామని అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
నేడు నగరంలోని కట్ట రాంపూర్ లో గల పదవ డివిజన్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి సతీష్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి సతీష్ బావన తో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు.
మొదటగా స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా బయలుదేరి డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్‌కు చేసిన అభివృద్ధి శూన్యమని.. ఈ రెండేళ్ల పాలనలో కరీంనగర్ కు రెండు రూపాయలు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకారలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని ప్రజలను మోసం చేసిందని , వృద్ధులకు పెన్షన్, కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం, ఆడబిడ్డలకు స్కూటీ ఇలా ఎన్నో అబద్ధపు హామీలను ప్రజలకు కల్పించి గద్దెనెక్కి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని.. ఈ రెండేళ్ల పాలనలో అమలు చేయని సంక్షేమాలను రానున్న మూడేళ్లలో ఇలా అమలు చేస్తారని నేను ప్రభుత్వాన్ని నిలదీశారు.
వచ్చే మూడేళ్ల తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని..మళ్లీ కరీంనగర్ నగర అభివృద్ధి తానే మంత్రిగా చేస్తానని.. పదవ డివిజన్ ను దత్తత తీసుకొని తలతలలాడే విధంగా సుందరంగా తీర్చిదిద్దుతానని.. బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో చేసిన అభివృద్ధిని చూడాలని.. అదేవిధంగా రాబోవు కాలంలో కూడా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుందన్నారు. పదవ డివిజన్ బి.ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి సతీష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ కార్పొరేటర్ నలువాల రవీందర్, ఉమాపతి, నాయకులు కర్ర సూర్య శేఖర్, పొన్నం రాజు , పదవ డివిజన్ పార్టీ అభ్యర్థి మర్రి సతీష్ బావన లు పాల్గొన్నారు.
అనంతరం నగరంలోని 56వ డివిజన్ లోని రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాటిపెల్లి శ్రీవాణి- సుభాష్ ల తో కలసి పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కారు గుర్తు పై ఓటేసి తాటిపల్లి శ్రీవాణి సుభాష్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అభ్యర్థి తాటి పెళ్లి శ్రీవాణి- సుభాష్ ల తో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ , నాయకులు చిదుర సురేష్ , రామిడి శ్రీధర్ , నగునూరి రాజేందర్, ఏవీ మల్లికార్జున, పెద్ది విద్యాసాగర్, పడకంటి శ్రీనివాస్, రామకృష్ణ, బొల్లం శ్రీనివాస్ డివిజన్ నాయకులు.. డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.