నిబంధనల ప్రకారం నామినేషన్ ప్రక్రియ* *అభ్యర్థుల సందేహాలు హెల్ప్ డెస్క్ లో నివృత్తి చేయాలి* *జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి* *కరీంనగర్ నామినేషన్ కేంద్రాల పరిశీలన*
కరీంనగర్ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ నామినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా...

కరీంనగర్
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ నామినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి పరిశీలించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో సదుపాయాలు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ వివరాలు ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆయా డివిజన్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి టీ పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
*కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన*
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలు, హెల్ప్ డెస్క్, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ద్వారా ఎన్నికల సిబ్బంది విధులను పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, షిఫ్టుల వారీగా 24 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని అన్నారు.
*చొప్పదండి నామినేషన్ కేంద్రాల పరిశీలన*
చొప్పదండి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు స్పష్టంగా వివరించాలని తెలిపారు. చొప్పదండి వార్డు స్థానాలకు అప్పటివరకు దాఖలైన నామినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు నామినేషన్ పత్రాలను పరిశీలించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట చొప్పదండి మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఉన్నారు.
No Comment! Be the first one.