నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్ల పరిశీలన*
కరీంనగర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లకు, కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులకు, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు, హుజురాబాద్ మున్సిపాలిటీ...

కరీంనగర్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లకు, కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులకు, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు, హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ నోటిఫికేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి డివిజన్ల వారీగా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. అభ్యర్థులు వచ్చే మార్గం వెళ్లే మార్గం వేరువేరుగా ఉండాలని, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు.
No Comment! Be the first one.