నాంపల్లిలో అగ్నిప్రమాదం.. సెల్లార్ లో చిక్కుకున్న ఐదుగురు
హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో నిన్న (శనివారం) మధ్యాహ్నం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా భవనంలో...

హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో నిన్న (శనివారం) మధ్యాహ్నం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా భవనంలో చిక్కుకున్న ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారి ఆచూకీ తెలపాలని బంధువులు రోదిస్తున్నారు. పోలీసుల నుండి సరైన సమాధానం లభించకపోవడంతో బాధిత బంధువులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.దీంతో పక్క భవనం నుండి గోడ పగలగొట్టి ప్రమాదం జరిగిన భవనం లోనికి వెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బంధువులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఇప్పటికీ అగ్నిప్రమాదం జరిగిన భవనం నుంచి దట్టంగా పొగ వెలువడుతోంది.. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంద.
No Comment! Be the first one.