నగర అభివృద్ధికి కాంగ్రెస్, బిజెపిలు నయా పైసా నిధులు తేలేదు – ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కరీంనగర్ లోని 51వ డివిజన్ కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన నేతలు బి.అర్.ఎస్ లో చేరారు. శుక్రవారం రోజున నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో బిజెపికి చెందిన నార్త్ జోన్ సెక్రటరీ...

కరీంనగర్
కరీంనగర్ లోని 51వ డివిజన్ కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన నేతలు బి.అర్.ఎస్ లో చేరారు. శుక్రవారం రోజున నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో బిజెపికి చెందిన నార్త్ జోన్ సెక్రటరీ బండారి ఆంజనేయులు ఆయన అనుచరులు 50 మంది పార్టీ లో చేరారు. వారికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసిన బిజెపి నేతలకు టికెట్లు ఇవ్వకుండా… బిఆర్ఎస్ పార్టీలో రిజెక్ట్ చేసిన నేతను పార్టీలో చేర్చుకుని అసలైన కార్యకర్తలకు బండి సంజయ్ అన్యాయం చేశారని గంగుల కమలాకర్ అన్నారు. దీంతో వారు మనస్తాపం చెంది అసలైన కార్యకర్తలకు బీజేపీలో స్థానం లేదని భావించి ఈ రోజు బీజేపీకి రాజీనామా చేసి బి.అర్.ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీ అడ్డుకోవడం తప్ప నగర అభివృద్ధికి నయా పైసా నిధులు తేలేదని గంగుల స్పష్టం చేశారు. నగర ప్రజలు కూడా.. కరీంనగర్ ఎవరి హయంలో అభివృద్ధి చెందిందో ఆలోచించాలని కోరారు. తమ పార్టీలో అవినీతి పరులకు దొంగలకు చోటు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల తో పాటు.. బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు మేచినేని అశోక్ రావు, గందె మహేష్ , బోనాల శ్రీకాంత్ ఐలెందేర్ యాదవ్, నాంపల్లి శ్రీనివాస్, జంగిలి సాగర్, దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్, సుంకిశాల సంపత్ రావు, కొమ్ము భూమయ్య,మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ ,అనిల్, మధుకర్ పటేల్, అశోక్, పవన్, సంతోష్ పలువు బిఆర్ఎస్ పార్ట్ నాయకులు మాజీ ప్రజా ప్రతిందులు , తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.