టిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
కరీంనగర్ గణతంత్ర వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. చింతకుంటలోని బి.అర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. మరో వైపు...

కరీంనగర్
గణతంత్ర వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. చింతకుంటలోని బి.అర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. మరో వైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. భారత్ మాతాకి జై… బోలో స్వాతంత్ర భారత్ కి జై నినాదాలు చేశారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బి.అర్.ఎస్ నేతలు పాల్గొన్నారు.
No Comment! Be the first one.