గోవా ట్రిప్.. ఈ టాప్ రిసార్ట్స్‌ను అస్సలు మిస్ అవ్వొద్దు..
దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాల్లో గోవా ఎప్పుడూ ముందుంటుంది. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు గోవాకు వస్తుంటారు. తక్కువ ఖర్చుతో బీచ్‌లు,...


దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాల్లో గోవా ఎప్పుడూ ముందుంటుంది. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు గోవాకు వస్తుంటారు. తక్కువ ఖర్చుతో బీచ్‌లు, ప్రకృతి అందాలు, వినోదం అన్నీ ఒకేచోట ఆస్వాదించాలనుకునే వారికి గోవా బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది.
బీచ్‌లు, ప్రశాంత వాతావరణం, రుచికరమైన వంటకాలు, అద్భుతమైన హోటల్స్ గోవా ప్రత్యేకత. ఇక్కడి హోటల్స్ పర్యాటకులకు లగ్జరీతో పాటూ విశ్రాంతిని కూడా అందిస్తాయి. మీరు గోవా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఈ టాప్ రిసార్ట్స్‌ను అస్సలు మిస్ అవ్వకండి.
సిడాడె డీ గోవా..
బీచ్‌ను ఆనుకుని విస్తరించి ఉన్న ఈ ఫైవ్ స్టార్ హోటల్.. గోవాలో ఎంతో ప్రసిద్ధి చెందింది. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ హోటల్లో పోర్చుగీస్ శైలి స్పష్టంగా కనిపిస్తోంది. గోవా ప్రత్యేక వంటకాలు, విభిన్న రకాల రెస్టారెంట్లు పర్యటకులను ఆకర్షిస్తాయి. మసాజ్ సెంటర్లు, సాయంత్రం వేళ లైవ్ మ్యూజిక్‌తో పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని ఇస్తాయి.
తాజ్ ఎక్సోటికా గోవా..
గోవాలోని బెనౌలిమ్ బీచ్‌లో ఈ విలాసవంతమైన ఫైవ్ స్టార్ రిసార్ట్ ఉంటుంది. ఇందులో గోల్ఫ్ కోర్సు, ప్రైవేట్ బీచ్, విలాసవంతమైన గదులు, విల్లాలు, అనేక రెస్టారెంట్లు, స్పా, కిడ్స్ క్లబ్, వివిధ క్రీడా కార్యకలాపాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి.
నోవాటెల్ గోవా షెరమ్ హోటల్..
ఆధునిక నిర్మాణ శైలి, విశాలమైన గదులు, మెరుగైన సేవలు.. ఈ రిసార్ట్ స్పెషాలిటీ. యోగా, ధ్యానం వంటి కార్యకలాపాలకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. రెస్టారెంట్లు, బార్, వినోద కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
గ్రాండ్ హయత్ గోవా..
సెంట్రల్ గోవాలో ఉన్న ఈ హోటల్.. బిజినెస్ టూరిస్టులు, లగ్జరీ కోరుకునే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇండో–పోర్చుగీస్ శైలి నిర్మాణం, విశాలమైన గదులు ఇక్కడి ప్రత్యేకత. అద్భుతమైన ఆతిథ్యం, ప్రశాంత వాతావరణం ఈ హోటల్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
హాలిడే ఇన్ రిసార్ట్ గోవా..
దక్షిణ గోవాలో ఉన్న ఈ రిసార్ట్.. ప్రశాంతతను కోరుకునే వారికి సరైన ఎంపిక. సముద్ర తీరానికి దగ్గరగా ఉండే ఈ హోటల్లో హరిత వాతావరణం మనసుకు హాయిని కలిగిస్తుంది. టెన్నిస్, ఇండోర్ గేమ్స్, పిల్లల కోసం ప్రత్యేక కిడ్స్ జోన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. గోవాలో విహారయాత్రను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలంటే సరైన హోటల్ ఎంపిక చాలా ముఖ్యం. లగ్జరీ, సౌకర్యాలు, ప్రశాంతత కోరుకునే వారికి ఈ టాప్ 5 హోటల్స్ అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.
No Comment! Be the first one.