*గెలిచిన తరువాత పార్టీ వీడను* *బీజేపీలోనే ఉంటా….ప్రజలకు అంకిత భావంతో సేవ చేస్తా* *బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల ప్రతిజ్ఝ*
కరీంనగర్ అయారాం గయారాం సంస్క్రుతితో రాజకీయాలు కంపుకొడుతున్న ఈ తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులతో వినూత్న రీతిలో ప్రతిజ్ఝ...

కరీంనగర్
అయారాం గయారాం సంస్క్రుతితో రాజకీయాలు కంపుకొడుతున్న ఈ తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులతో వినూత్న రీతిలో ప్రతిజ్ఝ చేశారు. గెలిచిన తరువాత పార్టీని వీడనని, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని, కరీంనగర్ అభివ్రుద్ధితోపాటు దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తానని ప్రతిజ్ఝ చేయించారు. అభ్యర్థులు ప్రతిజ్ఝ చేస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.
ఏమని ప్రతిజ్ఝ చేయించారంటే…
…………….అనే నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని, దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పనిచేస్తానని, గెలిచిన తరువాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, నిరంతరం పార్టీ కోసం నిబద్దతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.
No Comment! Be the first one.