కొడితే సిక్స్ కొట్టాలి.. -క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడిన వెలిచాల -రాజకీయాలను పక్కనపెట్టి కొద్దిసేపు ఆట విడుపు
కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా ఉన్నప్పటికిని కొద్దిసేపు ఆటవిడుపు ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం తీగల గుట్టపల్లిలో కాంగ్రెస్ నాయకుడు మూల కృష్ణారెడ్డి తన తండ్రి మూల...

కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా ఉన్నప్పటికిని కొద్దిసేపు ఆటవిడుపు ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం తీగల గుట్టపల్లిలో కాంగ్రెస్ నాయకుడు మూల కృష్ణారెడ్డి తన తండ్రి మూల నారాయణరెడ్డి స్మారకార్ధం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. రాజకీయాల్లో ప్రత్యర్థిలపై తన వాక్చాతుర్యంతో ఇరుకున పెట్టే రాజేందర్ రావు క్రికెట్లోనూ మంచి ప్రతిభ చూపడం విశేషం. కొద్దిసేపు క్రీడాకారులతో క్రికెట్ ఆడారు. చిన్ననాటి తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ బ్యాట్ పట్టుకొని మైదానంలో సిక్స్ కొట్టారు. అక్కడ క్రీడాకారులు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే రాజేందర్రావు కొద్దిసేపు ఆటవిడుపుగా క్రీడాకారుడుగా మారి క్రీడాకారులతో సందడి చేయడం ఆసక్తి కలిగించింది.
No Comment! Be the first one.