కృష్ణా జిల్లాలో సంచలనం.. కోటి రూపాయల కోడి పందెం
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా గన్నవరం కేసరపల్లి బరిలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కోడి పందేల వెనుక నడుస్తున్న కోట్ల రూపాయల లావాదేవీలు మరోసారి వెలుగులోకి...

కృష్ణా జిల్లా:
కృష్ణా జిల్లా గన్నవరం కేసరపల్లి బరిలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కోడి పందేల వెనుక నడుస్తున్న కోట్ల రూపాయల లావాదేవీలు మరోసారి వెలుగులోకి రావడంతో, రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ పందెంలో పాల్గొన్న కోళ్లల్లో హైదరాబాద్కు చెందిన జినెక్స్ అమర్ కోడి కృష్ణా జిల్లాకు చెందిన జాట్టు సుబ్రమణ్యం కోడి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాసేపు ఉత్కంఠగా సాగిన పోరులో చివరికి జినెక్స్ అమర్ కోడి ప్రత్యర్థి కోడిని ఓడించి విజయం సాధించింది. దీంతో పందెం మొత్తం అమర్ వర్గం ఖాతాలో పడింది.
No Comment! Be the first one.