కాంగ్రెస్ లో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు -పార్టీ నియమాలను వ్యతిరేకిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు -కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా నగరంలో చోటు...

కరీంనగర్
కాంగ్రెస్ పార్టీలో నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా నగరంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాల విషయమై కాంగ్రెస్ పార్టీ లో ఎవరికి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని తేల్చి చెప్పారు. డిసిసి కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకునే వారికి పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, నిర్ణయాలు అధిష్టానం అనుమతితో ఏ కార్యక్రమమైనా నిర్వహించడం జరుగుతుందన్నారు. టికెట్లు కేటాయింపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈ కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బీఫాంలో టికెట్లకు విషయం సంబంధించి పెద్దలు ఒక కమిటీ వేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర మంత్రుల అనుమతితో ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి సర్వే ప్రకారంగా వచ్చిన పేర్లను పరిశీలించి కుల, మత గెలుపు ప్రాతిపదికన అన్నిటిని పరిగణలోకి తీసుకొని టికెట్లు నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా టికెట్లు ఇస్తాము, టికెట్ మీకే వస్తుంది, టికెట్ మీకు కన్ఫర్మ్ అయింది అని ప్రకటనలు చేస్తే వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కేటాయింపు గురించి ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదని పేర్కొన్నారు. గెలుపు గుర్రాలను ప్రకటించే ముందు స్థానిక కాంగ్రెస్ నాయకత్వాన్ని సమావేశపరిచి వారితో సమన్వయం చేసుకొని రాష్ట్రం మరియు జిల్లా నాయకత్వం ఆదేశానుసారం ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ టికెట్లు ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా టికెట్ మీకే వచ్చింది మీకు బిఫామ్ వస్తుంది అని ప్రకటిస్తే దాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. పార్టీ అధ్యక్షులు పార్టీ కండువా కప్పి స్వాగతించినప్పుడే వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లుగా భావించవలసి ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మన అందరిదీ, రాబోయే రోజుల్లో బల్దియా పై కాంగ్రెస్ జెండా ఎగర వెయ్యాలంటే అందరూ సమిష్టిగా సమన్వయంతో కాంగ్రెస్ పార్టీకి పని చేయవలసి ఉంటుందని తెలిపారు. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా గాని పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ధర్నాలు , రాస్తారోకోలు చేసినట్లయితే వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యల కింద కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. కొత్తగా పార్టీలోకి రావాలనుకునే వారిని ఏ విధంగా ఆహ్వానించాలి ఎవరు గెలుస్తారు అనే విషయాలకు సంబంధించి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్యచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. గుండాటి శ్రీనివాస్ రెడ్డి,బోనాల శ్రీనివాస్, అహ్మద్ అలీ, మునిగంటి అనిల్, కుర్ర పోచయ్య, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, ఇమ్రాన్, రోళ్ళ సతీష్, జ్యోతి రెడ్డి, కొట్టే ప్రభాకర్, వీర దేవేందర్, కొండ హరీష్, తోట అంజయ్య, దీకొండశేఖర్, పెంట శేఖర్, వసీం, తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.