కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయండి.. –కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం.. –కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు –కాంగ్రెస్లో చేరిన 5వ డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకులు
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి...

కరీంనగర్
కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు విజ్ఞప్తి చేశారు. అందర్నీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్లోని 5 వ డివిజన్ రజ్వి చమన్ నుంచి ఎండి జైనుల్లాబుద్దీన్ పాటు 30 మంది ముస్లిం మైనారిటీ నాయకులు రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజేందర్ రావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు ను శాలువాలు పూలదండలతో రాజేందర్రావును మైనార్టీ నాయకులు సత్కరించారు. అనంతరం రాజేందర్ రావు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని అభ్యర్థులకు గెలుపును కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండి జైనుల్లా బుద్ధిన్ అలియాస్ జమీర్ పర్వేషాఖాన్ ఎండి ఇమాముద్దీన్ ముభిన్, జేషాన్ ఎంఏ రజాక్ కైరుద్దీన్, అబ్దుల్ రషీద్ తో పాటు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా 62 వ డివిజన్ నుంచి పూరేళ్ల సరోజ రాజేందర్ రావును కలిసి సత్కరించారు.
No Comment! Be the first one.