కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యం —-ఎమ్మెల్యే రంగుల కమలాకర్
కరీంనగర్ కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటే ఆ విజయంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రభావితం అవుతుందని పేర్కొన్నారు .మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే...

కరీంనగర్
కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటే ఆ విజయంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రభావితం అవుతుందని పేర్కొన్నారు .మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. త్వరలో జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా సోమవారం రోజున జిల్లా కేంద్రంలోనీ శ్వేత హోటల్లో బిఆర్ఎస్ పార్టీ 66 డివిజన్లకి సంబంధించిన ఇన్చార్జులను నియమించి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ లు హాజరై డివిజన్ ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లు మాట్లాడుతూ..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ కు ఈ రెండేళ్ల కాలంలో రెండు రూపాయలు కూడా తీసుకురాలేదని.. రాబోవు మూడేళ్లలో వారు ఏమీ అభివృద్ధి చేస్తారని.. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందని.. ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనీ తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని.. పదేళ్లపాటు దేశంలోనే తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లిందని.. రాబోవు రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. ప్రస్తుత తరుణంలో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిందన్నారు.
టిఆర్ఎస్ పార్టీ హయాంలో కరీంనగర్ చరిత్రలోనే.. ఎవరితో పొత్తు లేకుండా మేయర్ పీఠం టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే కరీంనగర్ నగరంలో 90 శాతం రోడ్లు కంప్లీట్ చేసామన్నారు. అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులను కరీంనగర్‌కు తీసుకువచ్చామని.. వాటన్నింటినీ గుర్తించి ప్రజలు బిఆర్ ఎస్ పార్టీ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ కు ఒక చరిత్ర ఉందని.. ఇక్కడినుండే కెసిఆర్ ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని..
కరీంనగర్లో విజయం సాధిస్తే రాష్ట్రరాజకీయాల్లో దాని ప్రభావం చూపుతుందన్నారు.
ప్రతి ఒక్క డివిజన్ ఇంచార్జి కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి వెళ్లారని.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్న వారిని పార్టీ ఎప్పుడూ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు.
అందరం కష్టపడి కరీంనగర్ నగర మేయర్ పీఠం కైవసం చేసుకుందామని పిలుపునిచ్చారు.
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఇప్పటికే 60 మందికి బీఫామ్ ఇచ్చామని తెలిపారు.
ఒక్కో డివిజన్లో ఒక్కరే పోటీలో ఉండే విధంగా. చూసామని.. అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
కానీ ప్రతి ప్రతిపక్ష పార్టీల్లో బి ఫామ్ ఎవరికి ఇస్తారో తెలియక కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, రవీందర్ రెడ్డి లు ఉన్నారు.
No Comment! Be the first one.