కరీంనగర్ పార్లమెంటు కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసినబీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి…
కరీంనగర్ కరీంనగర్ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున పార్లమెంట్ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ...

కరీంనగర్
కరీంనగర్ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున పార్లమెంట్ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ, జాతీయ సమైక్యతను, సమగ్రతను పరిరక్షిస్తూ, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభదినం సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నవభారత నిర్మాణం మన చేతుల్లోనే ఉందన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగ విలువలను స్మరించుకుంటూ, పాటిస్తూ ప్రధాని మోడీ నాయకత్వ సారథ్యంలో చేపట్టిన వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశము విశ్వ గురువుగా అవతరించడం ఖాయమన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ , పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, ఉపాధ్యక్షులు కళ్లెం వాసుదేవరెడ్డి, దండు కొమరయ్య, దాడి సుధాకర్, తనకు సాయి, నవీన్ లతోపాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.