ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి –జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్
కరీంనగర్ ప్రజాస్వామ్య దేశంలో సామాన్య పౌరుడి ఆయుధం ఓటుహక్కు అని.. ఎన్నికల వేళ ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ అన్నారు. జాతీయ ఓటరు...

కరీంనగర్
ప్రజాస్వామ్య దేశంలో సామాన్య పౌరుడి ఆయుధం ఓటుహక్కు అని.. ఎన్నికల వేళ ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటు ఎంతో కీలకమైందని అన్నారు. ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా పరిడవిల్లుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తమ సేవలు అందించిన ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు, టెక్నికల్ మేనేజర్లు, బీఎల్వోలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యువ ఓటర్లకు గుర్తింపు కార్డులు అందించారు. పలువురు సీనియర్ సిటిజన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు పలు ప్రదర్శనలు ఇచ్చారు.
ర్యాలీని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్
జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి భగత్ సింగ్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఈ ర్యాలీని ప్రారంభించారు.
ఓటును మించి ఏది లేదు- నేను కచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో ర్యాలీ తీశారు. కరీంనగర్ క్రీడా పాఠశాల విద్యార్థులు, స్కౌట్, గైడ్స్ విద్యార్థులు, కలెక్టరేట్, రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, డీవైఎస్ఓ శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.