ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి.. –బీఎల్ఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాలి* –*రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి — *అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష *హాజరైన ఇంచార్జి కలెక్టర్ పమేలా సత్పతి * — జిల్లాలో త్వరలోనే మ్యాపింగ్ పూర్తి చేస్తాం.. –పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం.. –జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
కరీంనగర్ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాలని తద్వారా సత్వరమే మ్యాపింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన...

కరీంనగర్
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాలని తద్వారా సత్వరమే మ్యాపింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. 2002 వివరాలతో, ప్రస్తుత వివరాలు సరి పోల్చి మ్యాపింగ్ ప్రక్రియను తర్వాతగతిన పూర్తి చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓ లు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. బిఎల్ఓ లు రోజువారీగా చేపట్టి ప్రోజెని మ్యాపింగ్ వివరాలను తమకు అందిస్తూ ఉండాలని పేర్కొన్నారు. బిఎల్ఓ లకు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎబిఎల్ఓ లు సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా పోలింగ్ బూత్ లలో ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత బూత్ లకు చెందిన బిఎల్ఓ లు అందరూ సమన్వయం చేసుకుంటే ఇబ్బందులు తొలుగుతాయని చెప్పారు. నిర్ణిత గడువులోగా ఈ ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2002 ఓటర్ లిస్టు ప్రకారం కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ అర్బన్ లో మ్యాపింగ్ కొంత పూర్తి చేయాల్సి ఉందని ఆ ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రత్యేకంగా బిఎల్వోలతో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ పై సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ అర్బన్ లో మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎక్కడైతే మ్యాపింగ్ చేసుకొని వారు ఉంటారో వారిని వెంటనే మ్యాపింగ్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. బి ఎల్ వో సూపర్వైజర్లు మ్యాపింగ్ తక్కువ ఉన్నచోట బీఎల్ఓ లతో కలిసి డోర్ టు డోర్ విజిట్ చేస్తూ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ లక్ష్యసాధనకు అధికారులంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్ కరీంనగర్ హుజురాబాద్ ఆర్డీవోలు కుందారపు మహేష్ రమేష్ బాబు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.