ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి*
కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో రెండవ దశ సిబ్బంది కేటాయింపు పూర్తయింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎన్నికల...

కరీంనగర్
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో రెండవ దశ సిబ్బంది కేటాయింపు పూర్తయింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.జితేందర్ రెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ పూర్తయింది. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ప్రక్రియ అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే మున్సిపల్ కమిషనర్, ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికలు జరిగే పట్టణాల్లో, నగరంలో బ్యాలెట్ బాక్సులు, విధులు నిర్వహించే సిబ్బంది, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది రవాణా ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్లో సౌకర్యాలపై సమీక్షించారు. ఆడిట్ అబ్జర్వర్ ఎం.మనోహర్ పాల్గొన్నారు.
No Comment! Be the first one.