ఆదివారం ప్రత్యేకంగా పదవ తరగతి విద్యార్థుల గృహ సందర్శనలు
కరీంనగర్ జెడ్పీహెచ్ఎస్ ఒద్యారం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరచే లక్ష్యంతో ఆదివారం ప్రత్యేకంగా గృహ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం మరియు ఎంఈఓ శ్రీ...

కరీంనగర్
జెడ్పీహెచ్ఎస్ ఒద్యారం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరచే లక్ష్యంతో ఆదివారం ప్రత్యేకంగా గృహ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం మరియు ఎంఈఓ శ్రీ ఎనుగు ప్రభాకర్ రావు, గణిత ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ కలిసి పదవ తరగతికి చెందిన మొత్తం 14 మంది విద్యార్థుల గృహాలను సందర్శించారు. విద్యార్థుల మార్కుల రిజిస్టర్, హాజరు వివరాలతో తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా చర్చించారు.విద్యార్థుల బలాలు, బలహీనతలు, పాఠశాలలో వారి విద్యా ప్రదర్శన, హాజరు స్థితిపై వివరించారు. పాఠశాలలో తీసుకుంటున్న మెరుగుదల చర్యలు, విద్యార్థులకు అవసరమైన మార్పులు, ఇంటివద్ద తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, పాఠశాలకి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమన్వయంతో ఈ కార్యక్రమం విద్యార్థుల విద్యా ప్రగతికి దోహదపడుతుందని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
No Comment! Be the first one.