అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
కరీంనగర్ కరీంనగర్ లోని కరీంనగరంలోని మానేరు రివర్ ఫ్రంట్, లేక్ పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా...

కరీంనగర్
కరీంనగర్ లోని కరీంనగరంలోని మానేరు రివర్ ఫ్రంట్, లేక్ పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి , వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వాకర్స్ మరియు విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ వెంకటస్వామి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం చట్టవిరుద్ధం మరియు ప్రమాదకరం అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం , మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ఇతరుల ప్రాణాలకు నష్టం కలిగించకూడదన్నారు. వయసు నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం, కావున వేగ నియంత్రణ పాటించాలన్నారు. అనంతరం, రోడ్డు నిబంధనలను పాటిస్తామని, తోటి వారికి అవగాహన కల్పిస్తామని, ప్రమాదాల రహిత సమాజం కోసం కృషి చేస్తామని విద్యార్థులు మరియు వాకర్స్‌తో అధికారులు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు, లేక్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఆర్.ఎస్.ఐ (RSI) రమేష్, ఇతర పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
No Comment! Be the first one.