*అక్రిడిటేషన్ కార్డుల జారీ జీవోలో సవరణలు*
హైదరాబాద్ అక్రిడిటేషన్ జీవో 252 లో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ. నంబర్ 103 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సవరణలు.. * డెస్క్ జర్నలిస్టులకు జారీ చేసే అక్రిడిటేషన్ కార్డుల్లో తప్పనిసరిగా మహిళలకు...

హైదరాబాద్
అక్రిడిటేషన్ జీవో 252 లో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ. నంబర్ 103 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
సవరణలు..
* డెస్క్ జర్నలిస్టులకు జారీ చేసే అక్రిడిటేషన్ కార్డుల్లో తప్పనిసరిగా మహిళలకు 33% జారీ చేయాలి.
* డెస్క్ జర్నలిస్టులకు ఇస్తామన్న మీడియా కార్డుకు బదులు అక్రిడిటేషన్ పేరిట కార్డు జారీ చేయాలి.
* 2.5 లక్షల సర్క్యులేషన్ పత్రికలకు మండల స్థాయిలో 1.5 లక్షల జనాభా ఉంటే అదనంగా మరొక అక్రిడిటేషన్ కార్డు జారీ చేయాలి.
* 2.5 లక్షలు ఉన్న పత్రికల్లో స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిం విభాగంలో పనిచేసే జర్నలిస్టులకు అదనంగా అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి.
* 75001 నుంచి 2.5 లక్షల వరకు సర్కులేషన్ గల పత్రికలకు రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిం విభాగంలో పనిచేసే జర్నలిస్టులకు అదనంగా అక్రిడిటేషన్లు జారీ చేయాలి.
* ఉర్దూ బిగ్ డైలీ కి బదులు ఉర్దూ దినపత్రికగా మార్పు చేశారు.
* రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ లో అదనంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధి ఒకరు, పెద్ద దినపత్రికల్లో పని చేసే ఒక డెస్క్ జర్నలిస్టుకు అవకాశం కల్పించారు.
——————————————–
No Comment! Be the first one.