అక్రమ బెట్టింగ్, జూదంపై కేంద్రం ఉక్కుపాదం.. 242 వెబ్సైట్లు బ్లాక్
ఆన్లైన్ బెట్టింగ్, జూదం వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతదేశంలో పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక నేరాలు, యువత వ్యసనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు...

ఆన్లైన్ బెట్టింగ్, జూదం వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతదేశంలో పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక నేరాలు, యువత వ్యసనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ బెట్టింగ్, ఆన్లైన్ జూదంపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. యువతను మత్తులోకి నెట్టేస్తున్న ఈ అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా 242 బెట్టింగ్, జూదం వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. అంతేకాదు.. ఇప్పటివరకు బెట్టింగ్, జూదాన్ని ప్రమోట్ చేస్తున్న దాదాపు 8 వేల వెబ్సైట్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇటీవల రియల్ మనీ గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. ఇప్పుడు అక్రమ వెబ్‌సైట్లపైనా ప్రత్యేక దృష్టి సారించింది
No Comment! Be the first one.